![]() |
![]() |

చందమామ రావే జాబల్లి రావే అంటు పిల్లలకి జోలపాడటం కామన్. కానీ చందమామే పాటలు పాడటం విన్నారా.. లేదా అయితే ఓసారి అంజలి పవన్ కూతురు చందమామ పాడే పాటలు వినండి. మీ అభిప్రాయం మార్చుకుంటారు. అవును చిన్న చందమామ పెద్ద పెద్దగా పాటలు పాడుతుంటే వినడానికి చెవులతో పాటు కళ్ళుకూడా పెద్దవి చేసుకోక తప్పదు మరి. ఇంతకీ ఎవరూ అంజలి పవన్ అనుకుంటున్నారా.. అయితే ఓసారి చూసేద్దాం...
మొగలిరేకులు సీరియలో నటించిన అంజలి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తనకి బోలెడు సినిమాల్లో, టెలివిజన్ రంగంలో ఆఫర్లు వచ్చాయి. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలి హైదరాబాద్ లో జన్మించింది. తన వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను ఎంతో ఉన్నంతంగా ఉంటుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లని చూస్తుంటేనే తెలుస్తుంది. అయితే జనవరి 24, 2015 న సినిమా రంగంలో పనిచేస్తున్న సంతోష్ పవన్ ని పెళ్ళిచేసుకుంది అంజలి. అప్పటినుండి తన పేరును అంజలి పవన్ గా మార్చుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అంజలి పవన్. అంజలి తన భర్త పవన్ తో కలిసి 'నీతోనే డ్యాన్స్ షో' లో పర్ఫామెన్స్ చేసింది. వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు రాధ, తరుణ్ మాస్టర్, సదా అంతా ఫిధా అయ్యారు. ఈ వయసులో ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం చాలా కష్టమంటూ రాధ కూడా తనని పొగిడారు.
అంజలి పవన్ యొక్క 'ఇట్లు మీ అంజలిపవన్' యూట్యూబ్ ఛానెల్ లో ఇప్పటికే చాలా రకాల వ్లాగ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానెల్ కి ఇప్పటికే నాలుగు లక్షల పైచిలుకు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇక అంజలి పవన్ కి ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు చందమామ. తను వేసే కాస్ట్యూమ్స్ కి డ్రెస్ లు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. ఇట్లు మీ అంజలి పవన్ యూట్యూబ్ ఛానెల్ లో తన కూతురు చందమామ పాడిన ఓడియమ్మా హీటు .. రేడియంలో లైటు.. బాడీలో ఇటు అటు అంటు నాని నటించిన " హాయ్ నాన్న " సినిమాలోనిది. ఈ పాటకి చిన్నపిల్లలకి యమక్రేజ్ ఉంది. ఇక తను పాడిన ఈ లిరిక్స్ కి డెఫినిషన్ ఏంటని చందమామని వాళ్ళ అమ్మ అంజలి అడిగినప్పుడు.. బాడీలో ఇటు అటు అని క్యూట్ గా రిప్లై ఇచ్చింది చందమామ. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
![]() |
![]() |